చీరల బ్యాగ్ అప్పగింత
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:30 AM
ఆటోలో చీరల బ్యాగ్ పోగొట్టుకున్న బాధితుడికి కర్నూలు పోలీసులు ఆ బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు.
కర్నూలు క్రైం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఆటోలో చీరల బ్యాగ్ పోగొట్టుకున్న బాధితుడికి కర్నూలు పోలీసులు ఆ బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన చీరల వ్యాపారి జగదీష్ మౌర్యఇన సర్కిల్ వద్ద ఆటో ఎక్కి డ్రస్ సర్కిల్ వద్ద ఆటో దిగాడు. కొంచెం ముందు పోయిన తర్వాత ఆటోలో బ్యాగ్ మరిచిపోయినట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. టూటౌన పోలీసులు కమాండ్ కంట్రోల్‌లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా సీసీ ఫుటేజీని పరిశీలించి ఆటోను గుర్తించారు. ఆటోలో ఉన్న రూ.12వేల విలువైన చీరల బ్యాగ్ ను తిరిగి అప్పగించడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు.