పూర్తిగా బయటపడిన సంగమేశ్వరాలయం
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:15 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్తనదుల సంగమ ప్రదేశంలోని సంగమేశ్వరాలయం జలదిగ్భంధం నుంచి పూర్తిస్థాయిలో బయటపడింది. శ్రీశైల జలాశయం నుంచి గణనీయంగా నీటి విడుదల జరగడంతో గురువారం ఉదయానికే ఆలయ ప్రాంగణంతో పాటు క్షేత్రానికి వెళ్లే మార్గం పూర్తి స్థాయిలో బయట పడింది.

ఆత్మకూరు/కొత్తపల్లి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్తనదుల సంగమ ప్రదేశంలోని సంగమేశ్వరాలయం జలదిగ్భంధం నుంచి పూర్తిస్థాయిలో బయటపడింది. శ్రీశైల జలాశయం నుంచి గణనీయంగా నీటి విడుదల జరగడంతో గురువారం ఉదయానికే ఆలయ ప్రాంగణంతో పాటు క్షేత్రానికి వెళ్లే మార్గం పూర్తి స్థాయిలో బయట పడింది. ప్రస్తుతం గర్భా లయంలో అడు గున్నర మేర నీటి నిల్వలు ఉండ టంతో వేప దారు శివలింగ దర్శనం కొంతమేర కలుగుతోంది. 2023లో జూలై చివరి వారంలో నీటమునిగిన సంగమేశ్వరుడు అదే ఏడాది డిసెంబరులో జలదిగ్భంధం వీడి భక్తులచే పూజలందుకున్నాడు. అయితే 2024 జూలై 23న నీటమునిగిన సంగమేశ్వరాలయం 241 రోజుల పాటు జలాధివాసమై తిరిగి బయల్పడింది. సంగమేశ్వరాలయం బయల్ప డటంతో ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీజలాల్లోని వేపదారు శివలింగానికి ప్రారంభ పూజలతో పాటు పలు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు పూజలు చేపట్టారు. సోమవారం నుంచి సంగమేశ్వరాలయంలో పూర్తిస్థాయిలో పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు తెలుస్తోంది.