భద్రత ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:02 AM
ప్రైవేటు పాఠశాలల యజమానులు బస్సుల భద్రత ప్రమాణాలను తప్పక పాటించాలని మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ నాగేంద్ర అన్నారు.
ఆళ్లగడ్డ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల యజమానులు బస్సుల భద్రత ప్రమాణాలను తప్పక పాటించాలని మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ నాగేంద్ర అన్నారు. బుధవారం స్థానిక ప్రజ్ఞా డిగ్రీ కళాశాలలో ఆళ్లగడ్డ తాలుకాలోని స్కూల్ బస్సుల యజమానులతో భద్రత ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనానికి అత్యవసర ద్వారం, 60 కి.మీలకు మించకుండా స్వీడ్ లాక్, ఫైర్ డిటెక్షన, అలారం, అగ్నిమాపక పరికరాలు ఉండేలా చూసు కోవాలన్నారు. కార్యక్రమంలో అపుస్కా అధ్యక్షుడు అమీర్‌బాషా, కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి, శివ, రాజా పాల్గొన్నారు.