ప్రజల్లోకి సురక్ష యాప్ సేవలు
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:41 PM
సురక్ష యాప్ సేవలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి అన్నారు.
సారా రహితమే లక్ష్యం కావాలి
ఉమ్మడి జిల్లా సీఐలతో డీసీ సమీక్ష
కర్నూలు అర్బన్ , డిసెం బరు 6 (ఆంధ్రజ్యోతి): సురక్ష యాప్ సేవలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల సీఐలతో అసిస్టెంట్ కమిషనర్ వి. హనుమంతరావు, సూపరింటెండెంట్ సుధార్‌బాబులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ మద్యం కొనుగోలుదారులకు ఇబ్బందులు తల్తెకుండా, అక్రమ మద్యానికి అవకాశం లేకుండా సురక్షా యాప్‌ల సేవలను అందుబాటులోకి తీసికెళ్లాలని సూచించారు. జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి స్టేషన్ పరిధిలో ప్రణాళికతో పని చేయాలన్నారు. కేసుల పురోగతి, జిల్లాలో అక్రమ మద్యం, సారాపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.