Share News

నేపాల్‌ నుంచి సురక్షితంగా...

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:11 AM

విహార యాత్ర కోసం నేపాల్‌ వెళ్లగా.. అక్కడ జరుగుతున్న దాడుల్లో ఆదోని వాసులు చిక్కున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన 22 మంది దాకా నేపాల్‌లో ఉన్నారు

నేపాల్‌ నుంచి సురక్షితంగా...
భారతదేశానికి చేరుకున్న పెండేకల్లు బసవరాజు, అనిత

దాడులతో ఇబ్బందులు పడ్డ ఆదోని వాసులు

మంత్రి నారా లోకేశ్‌ చొరవతో భారత్‌ చేరుకున్న వైనం

ఆదోని, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విహార యాత్ర కోసం నేపాల్‌ వెళ్లగా.. అక్కడ జరుగుతున్న దాడుల్లో ఆదోని వాసులు చిక్కున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన 22 మంది దాకా నేపాల్‌లో ఉన్నారు. వారిలో పట్టణంలోని ఎస్కేడీ కాలనీకి చెందిన భార్యాభర్తలు పెండేకల్లు బసవరాజు, అనితలున్నారు. వీరిద్దరూ విహారయాత్ర కోసం నేపాల్‌ వెళ్లారు. వృత్తిరీత్యా పెండేకల్లు బసవరాజు గోల్డ్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరితోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పది మంది వీరి బంధువులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. వీరందరినీ రక్షించేందుకు మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక చొరవ చూపి అక్కడ ఉన్న వారిని భారతదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఎస్కేడీ కాలనీకి చెందిన పెండేకల్లు బసవరాజు, అనిత దంపతులు భారతదేశానికి బుధవారం రాత్రి 10గంటల సమయంలో సురక్షితంగా చేరుకున్నారు. మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక ప్రయత్నాలతో వారిని సురక్షితంగా భారత్‌కు రప్పించారు. ఈవిషయం నారా లోకేశ్‌ కార్యా లయం నుంచి ఆదోని తెలుగు యువత నాయకులు మారుతినాయుడికి సమాచారం అందించారు. వెంటనే ఆయన వారి యోగక్షేమాలను తెలుసు కుంటూ ఫోన్‌లో వారితో మాట్లాడారు. అక్కడ చిక్కుకున్న మొత్తం 32 మంది వివిధ ప్రాంతాల వారు కూడా మంత్రి లోకేశ్‌ సాయంతో భారతదేశ సరిహద్దుకు చేరుకున్నారు. భారత్‌కు చేరుకున్న యాత్రికులు మంత్రి లోకేశ్‌, మారుతినాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 11 , 2025 | 12:11 AM