ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:39 PM
తుగ్గలి మండలం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నరేశ్ శనివారం కార్యాల యంలో రూ.13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు పట్టుబడ్డాడు.
రూ.13 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేశ్
పత్తికొండ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): తుగ్గలి మండలం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నరేశ్ శనివారం కార్యాల యంలో రూ.13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు పట్టుబడ్డాడు. తుగ్గలి గ్రామానికి చెందిన ఎంపీ టీసీ రాజు గత ఏడాది గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ. 1.3లక్షల విలువచేసే మట్టిరోడ్డు పనులు చేశారు. అం దుకు సంబంధించి మండల పరిషత్ గ్రాంట్ ద్వారా అధికారులు బిల్లులు చెల్లించాల్సి ఉంది. రోడ్డు కొలతలను ఎంబుక్ నమోదు కోసం పనుల విలువలో 10శాతం తనకు లంచం ఇవ్వాలని ఏఈ నరేశ్ డిమాండ్ చేశాడు. తనకు పెద్దగా లాభం మిగలలేదని, 10 శాతం కాకుండా అంతో ఇంతో ఇస్తానని రాజు ఆయనను పలుమార్లు కలిశారు. 10శాతం ఇస్తేనే ఎంబుక్‌లో నమో దు చేస్తామని ఏఈ చెప్పడంతో ఎంపీటీసీ రాజు కర్నూలులో ఏసీబీ అధికారులకు ఫిర్యా దు చేశారు. శనివారం సాయంత్రం పత్తికొండ సబ్ డివిజన్ కార్యాలయంలో ఉన్న ఏఈ నరేశ్ రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ ఏఈ నరేశ్‌పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాసులు, రాజు, ప్రభాకర్, కృష్ణయ్య ఉన్నారు.