నేడు గ్రామీణ వైద్యుల సదస్సు
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:59 PM
ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి తెలిపారు.
జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు గోవిందరెడ్డి
కర్నూలు హాస్పిటల్, జూలై 15(ఆంఽధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలోని ఓమిని హస్పిటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీడీ జనార్దన్ హాజరు అవుతారన్నారు. నగరంలోని బిర్లా కాంపౌండ్ పక్కన ఉన్న శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో ఈ సదస్సు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరుగుతుందని అన్నారు. మూడు వేల మంది దాకా హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.