విజయవాడకు ఇంటర్ సిటీ రైలు నడపాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:36 PM
కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని సీపీఎం రాష్ట కమిటీ సభ్యురాలు పి.నిర్మల డిమాండ్ చేశారు
కర్నూలు రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని సీపీఎం రాష్ట కమిటీ సభ్యురాలు పి.నిర్మల డిమాండ్ చేశారు. కర్నూలు సిటీ రైల్వేస్టేషన్ ఆవణలో సీపీఎం నాయకుల దీక్ష ఆదివారం రెండో రోజుకు చేరింది. రజధానికి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. 11 ఏళ్లలో ప్రభుత్వాలు మారినా నగర ప్రజలకు ఆవగింజంత మేలు కూడా చేయడంలేదని ఆరోపించారు. మొదటి రాజధాని అని చెప్పుకుంటూ తిరరిగే నాయకులు రాజధానికి రైలు వేయించలేకపోతున్నారని విమర్శిం చారు. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రిపై ఒత్తిడి తెచ్చి నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాముడు, లక్షణ్, గౌస్ దేశాయ్, ఆనంద్‌బాబు, లోకేశ్ పాల్గొన్నారు.