Share News

ఆర్‌యూను రాష్ట్ర స్థాయిలో నిలపాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:42 PM

ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్‌లో రాయలసీమ యూనివర్సిటీ రాష్ట్రస్థాయిలో నిలపా లని ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఎస్‌ విజయభాస్కర్‌ అన్నారు.

ఆర్‌యూను రాష్ట్ర స్థాయిలో నిలపాలి
ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ను సన్మానిస్తున్న వర్సిటీ అధికారులు, అధ్యాపకులు

ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్‌లో రాయలసీమ యూనివర్సిటీ రాష్ట్రస్థాయిలో నిలపా లని ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఎస్‌ విజయభాస్కర్‌ అన్నారు. శనివారం రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరి యంలో వర్శిటీ అధికారులు, అధ్యాపకులతో సమీక్షించారు. ఈ సందర్భం గా ఉపకులపతి వి. వెంకట బసవరావు మాట్లాడుతూ పీజీ సెంటర్‌లో చదివి, ప్రస్తుతం విద్యామండలిలో వైస్‌ చైర్మన్‌ హోదాలో రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఎస్‌ విజయభాస్కర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమతమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, వర్శిటీని రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలపాలని అన్నారు. వివిధ కోర్సులు అభ్యసి స్తున్న విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం వహించి మంచి వ్యక్తిత్వాన్ని పెంచాలని సూచించారు. ఈ సమీక్షలో రెక్టార్‌ ఎన్‌ టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ బోయ విజయకుమార్‌ నాయుడు, ప్రిన్సిపాల్‌ సీవీ కృష్ణారెడ్డి, నరసిం హులు, వివిధ విభాగాల హెచ్‌ వోడీలు, ఆధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:42 PM