నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:28 AM
బస్సులో ప్రయాణికు రాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను బాధితురాలికి అందజేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనమ్మ సోమవారం కోడుమూరు వెళ్లే బస్సు ఎక్కింది.
6. 5 తులాల బంగారు ఆభరణాలు అందజేత
వెల్దుర్తి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): బస్సులో ప్రయాణికు రాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను బాధితురాలికి అందజేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనమ్మ సోమవారం కోడుమూరు వెళ్లే బస్సు ఎక్కింది. వెంకటగిరి గ్రామం నుంచి కోడుమూరుకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో కండెక్టర్ ప్రయాణికులను వెంకటగిరిలో దింపారు. వెంకటగిరి నుంచి ఆటోలో కోడుమూరుకు చేరుకొని అక్కడి నుంచి ఆటోలో ప్యాలకుర్తికి వెళ్లారు. ప్యాలకుర్తికి వెళ్లిన తరువాత బ్యాగు చూసుకుంటే బంగారు ఆభరణాలు కనపడలేదు. వెంటనే కోడుమూరుకు చేరుకొని బస్సులో వెతికింది. డ్రైవర్, కండక్టర్‌లను అడగగా బస్సులో కనపడలేదని చెప్పారు. రాత్రి డోన్‌లో డిపోలోకి వెళ్లేటప్పుడు డ్రైవర్ శ్రీనివాసులు నిశితంగా తనిఖీ చేయగా బస్సులో ఒక బాక్సు దొరికింది. అందులో బంగారు ఆభరణాలు ఉండడంతో డిపోలో ఉన్న తనిఖీ అధికారులకు అందజేశారు. డిపో మేనేజరు బుధవారం వెల్దుర్తి ఎస్‌ఐ నరేశ్‌కు సమాచారం అంద జేశారు. బుధవారం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందజే యడానికి వెళ్లిన బాధితులు చెప్పిన వివరాలు సరిపోలడంతో ఎస్‌ఐ నరేశ్, డ్రైవర్ శ్రీనివాసులును పిలిపించి బాధితులకు ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు అప్పగించారు. డ్రైవర్ శ్రీనివా సులును, ఎస్‌ఐ నరేశ్‌ను బాధితులు బుధవారం సాయంత్రం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో సన్మానించారు.