Share News

ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ.8.033 కోట్లు : మంత్రి బీసీ

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:48 PM

కర్నూలు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం రూ. 8.033 కోట్లకు అనుమతి లభించిందని రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వనరుల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ.8.033 కోట్లు : మంత్రి బీసీ

బనగాన పల్లె, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం రూ. 8.033 కోట్లకు అనుమతి లభించిందని రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వనరుల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎయిర్‌పోర్టులో 2 అభివృద్ధి పనులకు 2025-26 సంవత్సరానికి విమానాశ్రయం కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. రన్‌వేస్‌ ఆండ్‌ సేఫ్టీని సరిదిద్దడానికి ఇతర నిర్వహణ పనులకు రూ.3.6 కోట్లు, కర్నూలు ఎయిర్‌పోర్టులో టాక్సీవేటు ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ అందించడానికి రూ.4.433 కోట్లకు అనుమతి లభించాయన్నారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:48 PM