Share News

లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.74లక్షల నిధులు

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:29 PM

జిల్లాలోని మంత్రా లయం నియోజక వర్గంలోని గురురా ఘవేంద్ర పరిధిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు సీఎం రూ.74లక్షల నిధులు మంజూరు చేశా రని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.

లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.74లక్షల నిధులు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మంత్రా లయం నియోజక వర్గంలోని గురురా ఘవేంద్ర పరిధిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు సీఎం రూ.74లక్షల నిధులు మంజూరు చేశా రని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర బాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపా రు. మూగలదోడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, కోసిగి మండలం శాతనూరుకు రూ.9లక్షలు, సోగనూర్‌ లిఫ్ట్‌, చిన్న కోత్తపల్లికి రూ.19.95 లక్షలు, దుద్ది లిఫ్‌ ఇరిగేషన్‌ మాదవవరానికి రూ.19.90 లక్షలు, దాదాపు 20 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలకు నిధులు మంజూరు చేశారు. ఈ ప్రాంత రైతులకు కూటమి ప్రభు త్వం న్యాయం చేసిందని ఆయన తెలిపారు.

Updated Date - Jul 18 , 2025 | 11:29 PM