వ్యవసాయ కళాశాలలకు రూ.6.50 కోట్లు
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:53 AM
రాష్ట్రంలోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాలల అభివృద్ధికిగాను ఐసీఆర్ సంస్ధ రూ.6.50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శారదా జయలక్ష్మి తెలిపారు
కొత్త వంగడాలు సృష్టించాలి
విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తాం
ఎఎన్‌జీఆర్‌ఏయూ వీసీ శారదా జయలక్ష్మి
మహానంది, జూలై 5 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాలల అభివృద్ధికిగాను ఐసీఆర్ సంస్ధ రూ.6.50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శారదా జయలక్ష్మి తెలిపారు. శనివారం రాత్రి వ్యవసాయ కళాశాల వార్షికోత్సం డీన్ వి.జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిం చారు. వీసీ శారదా జయలక్ష్మి హాజరయ్యారు. కళాశాల శాస్త్రవేత్తలు రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరిం చారు. క్రీడాపోటీల్లో విజేతలైన విద్యార్ధులకు బహుమతులు అందచేసారు. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయ విద్యలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. వరి వంగడాల్లో బిపిపిటీ-5204తో పాటు స్వర్ణ రకాలను న్యూడిల్లీ లోని జీనా హెడిటేజ్ సంస్ధ సరికొత్త ప్రయోగాలు చేసి కీమి కీటకాలు సోకకుండా సరికొత్త టెక్నాలజీతో తయారు చేసింద న్నారు. సీఎం చంద్రబాబు వ్యవసాయ కళాశాలలను సరికొత్త టెక్నాలజీతో మరింత ముందుకు తీసుకొని పోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆప్ అగ్రికల్చరల్ ఆఫీసర్ చేరుకూరి శ్రీనివాసరావు, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్, శాస్త్రవేత్తలు విజయ భాస్కర్, స్వరాజ్యలక్ష్మి, నారాయణరావు, మల్లేశ్వరరెడ్డి, త్రినాథరెడ్డి పాల్గొన్నారు.