రూ.5 లక్షల అపహరణ
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:18 AM
బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళుతున్న బాధితుడిని గమనించిన దుండగులు రూ.5లక్షలను అపహరించుకుని పోయారు
ఆలూరు, గస్టు 13 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళుతున్న బాధితుడిని గమనించిన దుండగులు రూ.5లక్షలను అపహరించుకుని పోయారు. బాధితుడి కథనం మేరకు.. హాలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన రైతు గోపాల్‌రెడ్డి ఆలూరులోని స్టేట్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకుని బైకులో గ్రామానికి వెళుతున్నాడు. దారి మధ్యలో మూత్ర విసర్జన కోసం బండి పక్కన పెట్టి వెళ్లాడు. బాధితుడిని గమనించి వెంబ డించిన దుండగులు సినీ ఫక్కీలో రూ.5 లక్షలు అపహరించుకు పో యారు. తిరిగి వచ్చిన బాధితుడు బండలో డబ్బులు లేకపోవడాన్ని గమ నించి లబోదిబోమంటూ ఆలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు