Share News

గోరకల్లుకు రూ.2.5 కోట్లు మంజూరు

ABN , Publish Date - May 14 , 2025 | 11:32 PM

గోరకల్లు రిజర్వాయర్‌లో మరమ్మతులకు రూ.2.5 కోట్లు మంజూరైనట్లు జిల్లా సాగు నీటి ప్రాజెక్టుల అధికారి, తెలుగు గంగ ఎస్‌ఈ శివ ప్రసాదరెడ్డి తెలిపారు.

గోరకల్లుకు రూ.2.5 కోట్లు మంజూరు
కుంగిన రిజర్వాయర్‌ కట్ట

నంద్యాల మున్సిపాలిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): గోరకల్లు రిజర్వాయర్‌లో మరమ్మతులకు రూ.2.5 కోట్లు మంజూరైనట్లు జిల్లా సాగు నీటి ప్రాజెక్టుల అధికారి, తెలుగు గంగ ఎస్‌ఈ శివ ప్రసాదరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సార్బీసీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్‌ పటిష్టతకు కలెక్టర్‌ రాజకుమారి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారన్నారు. గోరుకల్లు ఈఈ శుభకుమార్‌ మాట్లాడుతూ నిధులతో రిజర్వాయర్‌లో కుంగిన 120 మీటర్ల ఆనకట్టను పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు. కట్ట పటిష్టతకు ఇసుక, కంకర వడపోత నిర్మాణ పద్ధతిని అనుసరిం చనున్నట్లు చెప్పారు. ఈ పద్ధతి వల్ల రిజర్వాయర్‌ ఆనకట్ట పటిష్టంగా ఉంటుందన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని ఈఈ శుభకుమార్‌ తెలిపారు.

Updated Date - May 14 , 2025 | 11:32 PM