Share News

కుళ్లిన టమోటా.. పాడైన ఉల్లిగడ్డలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:16 AM

మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠ శాలలో విద్యార్థినులతో నిర్వా హకులు ఆటలాడుతున్నారు. తాజా కూరగాయలతో వంట చేయకుండా కుళ్లిన టమోటా, బూజు పట్టిన బీట్రూట్‌, పాడైన ఉల్లిగడ్డ, ముదరిన దొండకాయలతో వంట చేస్తు న్నారు. దీంతో విద్యార్థినుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచిఉంది.

కుళ్లిన టమోటా.. పాడైన ఉల్లిగడ్డలు
కుళ్లినా ఇవే తినాలి.. టమోటాలు, ముదిరిన దొండకాయలుతింటే అంతే.. ఫంగస్‌ ఏర్పడ్డ ఉల్లి

హొళగుంద కస్తూర్బాలో ఇంతే

ఇప్పటికే ఓసారి ‘ఆంధ్రజ్యోతి’లో కథనం.. అయినా అంతే..!

హొళగుంద, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠ శాలలో విద్యార్థినులతో నిర్వా హకులు ఆటలాడుతున్నారు. తాజా కూరగాయలతో వంట చేయకుండా కుళ్లిన టమోటా, బూజు పట్టిన బీట్రూట్‌, పాడైన ఉల్లిగడ్డ, ముదరిన దొండకాయలతో వంట చేస్తు న్నారు. దీంతో విద్యార్థినుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచిఉంది. గతంలో కూడా ఇలానే చేస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి‘ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అయినా షరా మామూలుగానే మారింది. పాఠశాలలో 210 మంది విద్యార్థినులు 6 వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్నారు.

మంగళవారం ఇదీ పరిస్థితి..

మంగళవారం పాఠశాలను పరిశీలించగా నిర్వా హకులు బూజుపట్టిన క్యారెట్‌, దొండకాయతో సాం బారు, కుళ్ళిన టమోటాతో రసం చేశారు. గత్యంతరం లేక బలవంతంగా భోజనం చేసినట్లు విద్యార్థులు వాపోతున్నారు. కూరగా యల గదిని పరిశీలిం చగా కుళ్ళిన పచ్చి మిరప, పురుగులు పట్టిన ముల్లంగి, ఫంగస్‌ ఉల్లిగడ్డలు కనిపిచాయి.

ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

ఇలాంటి ఆహారం తింటే పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రూ.లక్షల్లో ఖర్చు చేస్తూ, నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని ఆదేశిస్తున్నా అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నాసిరకం భోజనంపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినబడుతున్నాయి.

ప్రిన్సిపాల్‌ దివ్యభారతిని వివరణ కోరగా కాంట్రా క్టర్‌పై అధికారులకు ఫిర్యాదు చేశాం, పునరావృతం కాకుండా చూస్తామని యథాప్రకారం సెలవిచ్చారు.

Updated Date - Jul 30 , 2025 | 12:17 AM