వేగంగా విస్తరణ
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:34 AM
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కర్నూలు వైద్య కళాశాల వద్ద రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతు న్నాయి
మెడికల్ కళాశాల వద్ద తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కర్నూలు వైద్య కళాశాల వద్ద రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతు న్నాయి. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ధాల తరబడి కళాశాల మలుపు వద్ద ట్రాఫిక్ జాంలతో ప్రమాదాలు చోటుచేసుకుంటుడటంతో మంతి టీజీ భరత్ జోక్యంతో దుకాణాలు తొలగించి నిర్మాస్తున్నారు. ఇటీవలే దుకాణదారులను స్వచ్ఛందంగా షాపులను తొలగించుకున్న విషయం విదితమే. రోడ్డు, డ్రైనేజీ పనులు రెండు రోజుల్లోనే పూర్తయవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.