ఆర్టీసీ బస్సు ఏదీ?
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:53 PM
మండల కేంద్రం నుంచి చనుగొండ్ల మీదుగా కోడుమూరు వరకు 10 కి.మీల బీటీ రోడ్డు నిర్మించారు. అయితే తమ గ్రామాలకు బస్సులు తిప్పడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
గూడూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి చనుగొండ్ల మీదుగా కోడుమూరు వరకు 10 కి.మీల బీటీ రోడ్డు నిర్మించారు. అయితే తమ గ్రామాలకు బస్సులు తిప్పడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గతంలో బస్సు తిరిగేదని అయితే రహదారి బాగాలేదని ఆర్టీసీ అధికారులు బస్సును రద్దుచేశారు. కాగా అయిదు నెలల క్రితం నూతనంగా బీటీ రోడ్డు నిర్మించారు. దాదాపు వందల సంఖ్యలో ప్రయాణికులు, రైతులు కోడుమూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్సు సర్వీసు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.