Share News

సారూ.. ఇదేం తీరు?

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:33 AM

నగర పాలక అధికారులు తీరుతో ప్రజా ధనం వృథా అవుతోంది. నగరంలోని దేవనగర్‌లో ఇప్పటికే ఉన్న బీటీ రోడ్డుపై అధికారులు సీసీ రోడ్డు నిర్మిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

సారూ.. ఇదేం తీరు?
బీటీ రోడ్డుపై సీసీ రోడ్డు నిర్మాణం, ఇన్‌సెట్‌లో ఇళ్లవద్ద అడ్డంగా వేసిన కంకర

దేవనగర్‌లో బీటీ రోడ్డుపై సీసీ రోడ్డు నిర్మాణం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): నగర పాలక అధికారులు తీరుతో ప్రజా ధనం వృథా అవుతోంది. నగరంలోని దేవనగర్‌లో ఇప్పటికే ఉన్న బీటీ రోడ్డుపై అధికారులు సీసీ రోడ్డు నిర్మిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దేవనగర్‌ సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి విఠల్‌నగర్‌ రైల్వే గేటు వరకు రూ.1.50కోట్లతో సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. కాగా ఈ పనులు గత వైసీపీ ర హయాంలో మంజూరైనట్లు కొందరు అంటుండగా, టీడీపీ ప్రభుత్వం వచ్చాక నిలిపేంది. అయినా మరలా పనులు మొదలవడంతో ఇదేం పద్ధతని విమర్శలు వస్తున్నాయి.

స్థానికులు, వాహనదారుల అవస్థలు

పనుల కోసం రోడ్డుకు అడ్డంగా కంకర వేయడంతో స్థానికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తమ గృహాల ముందు తవ్వేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్డుకు మరమ్మతులు చేస్తే సరిపోయేదానికి ఇలా రూ.కోట్లు వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం

దేవనగర్‌లో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులు నా దృష్టికి వచ్చింది. పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాము. ప్రస్తుతానికి పనులు ఆపేయాలని అధికారులను ఆదేశించా. - పి.విశ్వనాథ్‌, కమిషనర్‌

విష్ణుటౌన్‌షిప్‌లో సీసీ రోడ్డు నిర్మించాలి

నగర పాలిక పరిధిలోని విష్ణు టౌన్‌షి్‌పలో సీసీ రోడ్డు నిర్మించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యుడు పుల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం కాలనీ ప్రజలు, కమిటీ సభ్యులతో కలిసి ప్రధాన రోడ్డుపై చేపలు పడుతూ నిరసన తెలిపారు. వేసిన చోటే మళ్లీ వేస్తున్న అధికారులకు విష్ణుటౌన్‌షి్‌పలో సీసీ రోడ్డు లేకపోవం కనిపించలేదా అని ప్రశ్నించారు. కాలనీల నుంచి కార్పొరేషన్‌కు రూ. కోటికి పైగా ఆదాయం వస్తున్నా రోడ్డు వేయాలన్న ఆలోచన రాకపోవడం దారుణమన్నారు. ఆర్‌.చంద్రశేఖర్‌, ఎం.ఆజాద్‌, కే.మల్లికార్జున, ఎస్‌.హైదర్‌, మహ్మద్‌ యూనుస్‌, ముస్తఫా ఉన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:33 AM