పెద్దాసుపత్రిలో నిలిచిన ఎంఆర్‌ఐ సేవలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:34 AM
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు రోజులుగా ఎంఆర్‌ఐ (మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతు న్నారు.
కర్నూలు హాస్పిటల్, డిసెంబ రు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు రోజులుగా ఎంఆర్‌ఐ (మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతు న్నారు. సర్వర్ మొరాయించడంతో కొత్త కేసులను సిబ్బంది తీసుకోవడం లేదు, ఇప్పటికే రిజిస్ర్టేషన్ అయిన పాత కేసులను మాత్రమే చేస్తూ కొత్త కేసులను వెనక్కు పంపుతున్నారు. ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ సేవలను పీపీపీ కింద విజయవాడకు చెందిన ప్రమోదీని మెడికల్ కేర్ నిర్వహిస్తుంది. రోజూ దాదాపు 70 మంది రోగులకు ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహిస్తారు. న్యూరోసర్జరీ, న్యూరాలజీ, మెడికల్ సర్జరీ, ఆర్థో, గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగాల నుంచి రోగులు ఎక్కువగా వస్తుంటారు. రెండు రోజులుగా నూతన కేసులు తీసుకోకపోవడంతో దాదాపు 150 మంది రోగులు ఎదురు చూస్తున్నారు. అధికారులు స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి ఎంఆర్‌ఐ పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.