స్మార్ట్ మీటర్ల భారాన్ని తిప్పికొట్టండి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:00 AM
రాష్ట్ర ప్రభుత్వం గృహ విని యోగదారులపై మోపనున్న స్మార్ట్ మీటర్ల భారాన్ని తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కే. ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చా రు.
కర్నూలు న్యూసిటీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గృహ విని యోగదారులపై మోపనున్న స్మార్ట్ మీటర్ల భారాన్ని తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కే. ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చా రు. గురువారం సుందరయ్య భవన్‌లో జిల్లా కార్యదర్శివర ్గసభ్యుడు పీఎస్. రాధా క్రిష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజల మెడలకు ఉరితాళ్లు బిగించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. వ్యాపా ర సముదాయాలకు ఇప్పటికే మీటర్లను బిగించడం పూర్తిచేసిన ప్రభుత్వం 200 యూనిట్లు పైబడి విద్యుత్ బిల్లు వచ్చే గృహ వినియోగదారులకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు జి. రామక్రిష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.