Share News

ప్రతికూల వార్తలపై స్పందించండి

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:48 PM

ప్రతి రోజూ వార్తాపత్రికలో వచ్చిన ప్రతికూల వార్తలపై శాఖల అధికారులు వేగంగా స్పందించి నివేదికను పంపించాలని కలెక్టర్‌ డా. సిరి అధికారులను ఆదేశించారు.

ప్రతికూల వార్తలపై స్పందించండి
ప్రజల నుంచి అర్జీలు స్కీకరిస్తున్న కలెక్టర్‌ డా. సిరి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి రోజూ వార్తాపత్రికలో వచ్చిన ప్రతికూల వార్తలపై శాఖల అధికారులు వేగంగా స్పందించి నివేదికను పంపించాలని కలెక్టర్‌ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వ హించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి సమస్యల వినతులను స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన అర్జీలను మరింత సమర్ధవంతంగా పరిష్కరించేందుకు నోడల్‌ అధికారులను నియమించడం జరుగుతోందన్నారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలకు సంబంధించిన అర్జీలు అత్యధి కంగా వస్తున్నందున ఈ శాఖలు వేగవంతంగా స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెకటర్లు అనురాధ, కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 11:48 PM