రీ ఓపెన్ దరఖాస్తులను పరిష్కరించండి: కలెక్టర్
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:05 AM
రీ ఓపెన్ దరఖాస్తులను తక్ష ణమే పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు
పీజీఆర్‌ఎ్‌సకు 200 దరఖాస్తులు
నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రీ ఓపెన్ దరఖాస్తులను తక్ష ణమే పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పీజీఆర్‌ఎ్‌సకు 200 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 30,985 ప్రజాఫిర్యాదులనను పరిష్కరించామని ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయసేకరణ కూడా చేపట్టామన్నారు. రీ ఓపెన్ అయిన 59 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెండింగ్‌లో ఉన్న 1811 దరఖాస్తులకు వితిన్ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు జేసీ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.