Share News

గడువులోగా అర్జీలను పరిష్కరించండి

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:22 PM

పీజీఆర్‌ఎ్‌సలో వచ్చే ప్రతి అర్జీని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

గడువులోగా అర్జీలను పరిష్కరించండి
వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.సిరి

కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎ్‌సలో వచ్చే ప్రతి అర్జీని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌ల పరిష్కారంపై సీఎం కార్యాలయం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తోందన్నారు. అధికారులందరూ పీజీఆర్‌ఎ్‌సలో ప్రతి రోజు లాగిన్‌ అయి ఎట్‌ టూ వ్యూ అర్జీలు లేకుండా చూడాలన్నారు. ఇంటి పట్టాల కోసం చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన వెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ కూడా ఉన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 11:22 PM