Share News

దరఖాస్తులను పరిష్కరించండి : కలెక్టర్‌

ABN , Publish Date - May 05 , 2025 | 11:46 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు.

దరఖాస్తులను పరిష్కరించండి : కలెక్టర్‌
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనం తరం కలెక్టర్‌ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. సీఎంఓ గ్రీవెన్స్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్జీలను వేగవం తంగా పరిష్కరించాలన్నారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ వద్ద 26, కర్నూలు ఆర్డీఓ వద్ద 25, పత్తికొండ ఆర్డీఓ వద్ద 7, సర్వే ఏడీలో 2, అటవీశాఖ, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, మత్స్యశాఖ, కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఒక అర్జీ చొప్పున పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:46 PM