Share News

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:34 PM

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ దారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ రాజ కుమారి తెలిపారు.

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ దారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ రాజ కుమారి తెలిపారు. పట్టణంలోని పీజీఆర్‌ఎస్‌ కంట్రోల్‌ రూమ్‌లో శుక్ర వారం పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలె క్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా జూన్‌ 2024 నుంచి ఇట్పటి వరకు 41,247 అర్జీలు స్వీకరించగా అందులో 38,862 సమస్యలు పరి ష్కారమైనట్లు తెలిపారు. మిగతా వాటిని కూడా త్వరితగతిన పరి ష్కరించేలా అధికారులను ఆదేశించామన్నారు. ఫిర్యాదులపై సరైన సమాధానాలు ఇవ్వని గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఉన్న 230 మంది అధికారులకు మెమోలు జారీ చేశామని చెప్పారు. 13,403 ఫిర్యాదులను ఉన్నతాధికారులు రీ ఓపెన్‌ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేం దుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని కోరారు.

Updated Date - Aug 29 , 2025 | 11:34 PM