Share News

రైతు బజారు నుంచి దళారుల తొలగింపు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:24 AM

): నగరంలోని సి.క్యాంపు రైతు బజారులో ఏళ్ల తరబడి తిష్టవేసిన దళారులను బయటకు పంపారు. గురువారం సీఐ కేశయ్య, సిబ్బంది రైతుబజారు అధికారులు, సెక్యూరిటీ గార్డులు సంయుక్తంగా చర్యలు తీసుకోవడంతో రైతులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతు బజారు నుంచి దళారుల తొలగింపు
దళారులను బయటకు పంపుతున్న పోలీసులు

పోలీసుల సాయంతో 50 మందిని బయటకు పంపిన అధికారులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సి.క్యాంపు రైతు బజారులో ఏళ్ల తరబడి తిష్టవేసిన దళారులను బయటకు పంపారు. గురువారం సీఐ కేశయ్య, సిబ్బంది రైతుబజారు అధికారులు, సెక్యూరిటీ గార్డులు సంయుక్తంగా చర్యలు తీసుకోవడంతో రైతులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడి, ఇతర కారణాలతో రైతులకు చెందాల్సిన స్థలాలను ఆక్రమించ డంపై ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్టేట్‌ అధికారి కళ్యాణమ్మ, ఉద్యాన శాఖ అధికారి శివకుమార్‌ త్రీటౌన్‌ సీఐ కేశవయ్యను కలిసి దళారులను ఏరివేసేందుకు సహకరించాలని కోరడంతో సీఐ, పోలీసులు రైతుబజారుకు చేరుకుని వెంటనే బయటకు వెళ్లకుంటే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. దాదాపు 50 మంది దళారులను బయటకు పంపినట్లు ఎస్టేట్‌ అధికారి కళ్యాణమ్మ తెలిపారు. సెక్యూరిటీ గార్డులు శ్రీనివాసరెడ్డి, చిన్నస్వామి, గురువయ్య గోపాల్‌, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:25 AM