జిల్లాలో సారాను నిర్మూలించండి
ABN , Publish Date - May 23 , 2025 | 12:19 AM
జిల్లాలో సారాను పూర్తిగా నిర్మూలించాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. గురువారం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఆసిస్టెంట్ కమిషనర్ వి. హనుమంతరావు, డీపీఈవో, ఏఈఎస్‌లతో ఆయన నవోదయం-2లో సారా నిర్మూలనపై సమీక్షించారు.
నవోదయం-2 పై డైరెక్టర్ ఆరా..
డీసీ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష
కర్నూలు అర్బన్, మే 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సారాను పూర్తిగా నిర్మూలించాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. గురువారం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఆసిస్టెంట్ కమిషనర్ వి. హనుమంతరావు, డీపీఈవో, ఏఈఎస్‌లతో ఆయన నవోదయం-2లో సారా నిర్మూలనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాటు సారాయి, సుంకం చెల్లించని అక్రమ మద్యం, గంజాయిని అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు, వీటిపై నమోదు చేసిన కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కర్నూలును సారా రహిత జిల్లాగా ప్రకటించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కంట్రోల్ రూమ్ నుంచి బార్డర్ చెక్ పోస్టుల పనితీరును పరిశీలించారు. చెక్ పోస్టుల్లో నిఘా పెంచి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. రీజినల్ ఎక్సైజ్ ల్యాబొరేటరీ, అందులోని పరికరాలను పరిశీలించి ల్యాబ్ పని తీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ సుధీర్ బాబు, ఏఈఎస్ రాజేఖర్‌గౌడ్, రామక్రిష్ణారెడ్డి, సీఐలు రాజేంద్రప్రసాద్. జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్‌ను కలిసిన జిల్లా ఎక్సైజ్ అధికారుల సంఘం
ఎక్సైజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మను జిల్లా ఎక్సైజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని, కానిస్టేబుల్, సిబ్బంది కొరత వల్ల ఉద్యోగులకు పని భారం ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఐ సందీప్, సోమశేఖర్, నవీన్, రేహనా బేగం పాల్గొన్నారు.