పేదల గృహాలకు భారీ ఊరట
ABN , Publish Date - May 15 , 2025 | 12:06 AM
సొంత ఇంటిని నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం ప్లాన్ మంజూరు విషయంలో భారీ ఊరట కలిగిస్తూ నోటిఫికే షన్ జారీ చేసింది. 60 చదదరపు గజాలు (50 చదరపు మీటర్లు) స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ఇక నుంచి మున్సిపాలిటీ అనుమతి అవసరం లేదు
60 గజాల్లోపు నిర్మాణాలకు రూ.1తో అనుమతి ఫ ప్రభుత్వ ఉత్తర్వులు
ఆదోని టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి): సొంత ఇంటిని నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం ప్లాన్ మంజూరు విషయంలో భారీ ఊరట కలిగిస్తూ నోటిఫికే షన్ జారీ చేసింది. 60 చదదరపు గజాలు (50 చదరపు మీటర్లు) స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ఇక నుంచి మున్సిపాలిటీ అనుమతి అవసరం లేదు. గ్రౌండ్ ప్లోర్, ఫస్ట్ ప్లోర్ నిర్మాణాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (ఎంఏయూడీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో కేవలం రూపాయి టోకెన్ ఫీజు చెల్లించి, రిజిస్టర్ చేసుకుని స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొందే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ భూములు, నిషేధిత, వివాదాస్పద భూములలో ఈ నిబంధన చెల్లదని ఉత్తర్వులలో పేర్కొన్నారు.