అన్నదాతలకు ఊరట
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:31 PM
కర్నూలు జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల రైతులకు ఊరటకలిగింది.
కర్నూలు అగ్రికల్చర్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల రైతులకు ఊరటకలిగింది. ఎండుతున్న పైర్లకు ఈ వర్షాలు ప్రాణం పోసినట్ల యిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. పత్తికొండలో అత్యధికంగా 56 మిల్లీమీటర్ల మేర వర్షం నమోదైంది. తుగ్గలిలో 24.2 మి.మీ., కల్లూరులో 14.2, కర్నూలు అర్బన్‌లో 13.6, కర్నూ లు రూరల్‌లో 12.2, ఓర్వకల్లు మండ లంలో 12.2, దేవనకొండలో 12.2, సి.బెళగల్‌లో 4.8, వెల్దుర్తిలో 3.2, క్రిష్ణగిరిలో 2.2, గూడూరులో 1.4 మి. మీ., మేర వర్షపాతం నమోదైంది. జూ లైలో సాధారణ వర్షపాతం 52.7 మి. మీ., కాగా, ఇప్పటికీ 47 మి.మీ., వర్షం నమోదైందని జేడీ వరలక్ష్మి తెలిపారు.