ఆదోని జిల్లా కోసం రిలే దీక్షలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:41 AM
ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ గౌరవ అధ్యక్షుడు కమలే గణేష్, జేఏసీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మల్లెల అల్ర్ఫెడ్‌రాజు డిమాండ్ చేశారు.
మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు
ఎమ్మిగనూరు టౌన, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ గౌరవ అధ్యక్షుడు కమలే గణేష్, జేఏసీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మల్లెల అల్ర్ఫెడ్‌రాజు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో జే ఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలోని కర్నూల్‌లోని పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని పత్తికొండ, అలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా ప్రకటించకుండా ఉండడం దారుణమన్నారు. ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతం లో మెరుగైన విద్య, వైద్యం, సాగు, తాగు నీరు, పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేసి పశ్చిమ ప్రాంతంలోని ఆర్డీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అభివృద్దికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. రిలే నిరాహార దీక్షకు ప్రజా సంఘాలు సిపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు ప్రసాద్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రంగన్న, బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మినారాయణలు మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు శేఖర్, ఉదయ్, కృష్ణ, ఆఫ్రీది దీక్షలో పాల్గొన్నారు.