Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:21 AM

క్రీడలతో మానసికోల్లా సం కలుగుతుందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లా సం కలుగుతుందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి, ఎంఈవో ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే కోట్ల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వ హించడం అభినందనీయమన్నారు.

ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలి: సచివాలయ ఉద్యో గులు ప్రజలకు అందిస్తున్న సేవలపై నాణ్యతతో మెరుగుపరచాలని ఎమ్మెల్యే కోట్ల సూచించారు. మంగళవారం మండలంలోని ఎద్దుపెంట గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేసి, రికార్డులను తనిఖీ పరిశీలించారు. ఉపాధ్యాయులకు విద్యా ప్రమాణాలను మెరుగుపరచా లని ఎమ్మెల్యే కోట్ల సూచించారు. మంగళ వారం మండలంలోని మండల పరిషత ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వల సల రామకృష్ణ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ఓబులాపురం శేషిరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివా సులు యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, ఎంఈవో-2 రఘునాయక్‌, తిరునాంపల్లి, గిడ్డారెడ్డి, తిరునాంపల్లి ఆలంకొండ గిరి ప్రసాద్‌ రెడ్డి, జనసేన నాయకులు ఆలా మోహన రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:21 AM