Share News

రోగుల వివరాలు ఈ-హాస్పిటల్‌లో నమోదు చేయండి: సూపరింటెండెంట్‌

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:41 AM

ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల వివరాలను ఈ-హాస్పిటల్‌ మాడ్యుల్‌లో నమోదు చేయాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు వివిధ విభాగాల హెచవోడీలను ఆదేశించారు.

రోగుల వివరాలు ఈ-హాస్పిటల్‌లో నమోదు చేయండి: సూపరింటెండెంట్‌
జనరల్‌ మెడిసిన ఓపీని తనిఖీ చేస్తున్న సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, జూన 11(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల వివరాలను ఈ-హాస్పిటల్‌ మాడ్యుల్‌లో నమోదు చేయాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు వివిధ విభాగాల హెచవోడీలను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన మెడికల్‌, డెం టల్‌, ఈఎనటీ, జనరల్‌ సర్జరీ, ఎమర్జెన్సీ ఓపీ విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు రిజిస్ర్టేషన, ఈ -హాస్పిటల్‌ మాడ్యుల్‌ డేటా ఎంట్రీ, వైద్యుల సమయపాలనపై ఆరా తీశారు. వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అనంతరం క్యాజువాల్టీలో ఉన్న ఎమర్జెన్సీ విభాగానికి వెళ్లి ఈ-హాస్పిటల్‌ మాడ్యుల్‌లో ఓపీ, అడ్మిషన కేసులు నమోదు అయ్యేలా చూసుకోవాలన్నారు. సూపరిం టెండెంట్‌ వెంట ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ వెంకటేశ్వరరావు, జనరల్‌ మెడిసిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ కిరణ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:41 AM