యాగంటిలో దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:48 AM
ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిని దేవదాయశాఖ ప్రాం తీయ సంయుక్త కమిషనర్ చంద్ర శేఖర్ ఆజాద్ శుక్రవారం దర్శించుకు న్నారు.
బనగానపల్లె, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిని దేవదాయశాఖ ప్రాం తీయ సంయుక్త కమిషనర్ చంద్ర శేఖర్ ఆజాద్ శుక్రవారం దర్శించుకు న్నారు. ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి, యాగం టిపల్లె ఉపసర్పంచ మౌళీశ్వరరెడ్డి, ఆలయ పూజారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. యాగంటి ఉమామహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరి శీలించారు. ఆయనకు ఆలయ ఏసీ పాండురంగారెడ్డి తీర్థ ప్రసాదాలు అందించారు. నంద్యాల డీఈవో మోహన, కొత్తూరు ఈవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.