శ్రీశైలానికి తగ్గిన ఇన్‌ఫ్లో
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:14 PM
శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది.
883.80 అడుగుల నీటి నిల్వ
శ్రీశైలం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 23,638 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 6,759 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సాయంత్రానికి శ్రీశైల జలాశ యానికి ఇన్‌ఫ్లో 26,478 క్యూసెక్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 9,585 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి ద్వారా 35,315 మొత్తంగా 44,900 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలయింది. జలాశయంలో నీటిమట్టం 883.80 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలకు గాను 208.72 టీఎంసీలుగా నమోదైంది.