Share News

కంది'పోయింది'

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:56 PM

భారీ వర్షాల ప్రభావంతో కంది పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటు న్నారు. మండలంలోని 11 గ్రామాల్లో 12 వేల ఎకరాల్లో ఈ ఖరీ్‌ఫలో కంది పంటను సాగు చేశారు.

కంది'పోయింది'
మద్దికెరలో దెబ్బతిన్న కంది పంట

అధిక వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న కంది పంట

తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలిన వినతి

మద్దికెర, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల ప్రభావంతో కంది పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటు న్నారు. మండలంలోని 11 గ్రామాల్లో 12 వేల ఎకరాల్లో ఈ ఖరీ్‌ఫలో కంది పంటను సాగు చేశారు.

ముంచిన వర్షం..

మొదట్లో పంట ఆశాజనకంగా ఉండటం, మొక్కలు ఏపుగా పెరగడంతో రైతులు సంతోషించారు. అయితే పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఎకరాకు రూ.25వేల పెట్టుబడి..

కంది సాగుకు ఇప్పటికే ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రెతులు అంటున్నారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురవడంతో ఎంతో ఆశతో పంటలు సాగు చేశామని, దురదృష్టవశాత్తు పంట చేతికొస్తున్న సమయంలో పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మందులు వాడినా ఫలితం లేదు..

కంది పంటను కాపాడుకోవడానికి క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడామని అయినా కోలుకోలేదని రైతులు వాపోతున్నారు. నల్లరేగడి పొలాలు కావడతో తేమ ప్రభావంతో పంట ఎండిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

రూ.లక్ష పెట్టుబడి పెట్టా

నాలుగెకరాల్లో కంది సాగుచేశా. ఎకరాకు రూ.25వేల చొప్పున రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. వర్షం దెబ్బకు పంట దెబ్బతింది, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. - యుగంధర్‌, అగ్రహారం

ఎరువులు పిచికారీ చేయాలి

కంది మొక్కలు దెబ్బతిని ఉంటే 13045 రకం ఎరువును ఎకరాకు కిలో చొప్పున పిచికారీ చేయాలి. పంట దెబ్బతిన్న రైతులు సంప్రదిస్తే పంటను కాపాడుకునేందుకు సూచనలు, సలహాలు ఇస్తాం. - ఏవో, రవి

Updated Date - Aug 30 , 2025 | 11:59 PM