Share News

విచ్చలవిడిగా ఎర్రమట్టి దందా

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:09 AM

మండల కేంద్రం, బ్రాహ్మణదొడ్డి, పోలకల్లు, సంగాల, చింతమానుపల్లె, బురాన్‌ దొడ్డి గ్రామాలలో ఎర్రమట్టి దందా విచ్చలవిడిగా సాగుతోంది.

విచ్చలవిడిగా ఎర్రమట్టి దందా
ట్రాక్టర్లలో తరలుతున్న ఎర్రమట్టి

మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు

సి. బెళగల్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం, బ్రాహ్మణదొడ్డి, పోలకల్లు, సంగాల, చింతమానుపల్లె, బురాన్‌ దొడ్డి గ్రామాలలో ఎర్రమట్టి దందా విచ్చలవిడిగా సాగుతోంది. రెవెన్యూ అధికారులు మామూళ్ళ మత్తులో తూలుతూ దీన్ని పట్టించుకోవడం లేదని ఈ గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. మంగళవారం మండల కేంద్రంలో పట్టపగలు ఎర్రమొరుసును తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్‌ వెంకటలక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్‌ ఆదేశాల మేరకు ఆరైఐ తరుణ్‌, గ్రామ వీఆర్వోలు, వెంకటేశ్వర్లు, గౌరి ఎక్స్‌కవేటర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అధికారులకు మామూళ్లు..

ఎర్రమట్టి తరలిస్తున్న ట్రాక్టర్‌, ఎక్స్‌కవేటర్‌ యజ మానులు కలిసి పోలీసులకు, రెవెన్యూ, అధికారు లకు రూ. లక్ష రూపాయలు మామూళ్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇక తాము ఎర్రమొరుసును ఎక్కడికి తరలించినా ఎవ్వరూ అడగకూడదని ట్రాక్టర్‌, ఎక్స్‌కవేటర్‌ యజమానులు అన్నారు. ఈ విషయం తహసీల్దార్‌ను వివరణ కోరగా.. తాము ఎర్రమొరుసు తవ్వకాలకు, తరలింపునకు ఎవ్వరికీ అనుమ తులు ఇవ్వలేదని అన్నారు. ఎర్రమొరుసు కావాలను కుంటే మైనింగ్‌ అధికారులతో అనుమతి తీసుకుని తమ దగ్గరకు వస్తే అనుమతి ఇస్తామన్నారు. అక్రమంగా తర లిస్తే ట్రాక్టర్లను, ఎక్స్‌కవేటర్‌లను సీజ్‌ చేస్తామని అన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:14 AM