Share News

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:32 AM

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ అభివృద్ధి పక్కన పెట్టి రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన
వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే విరుపాక్షి

ఆలూరు, జూన్‌16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ అభివృద్ధి పక్కన పెట్టి రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాల యంలో వెన్నుటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ వెన్నుపోటు పుస్తకం లో వ్యవస్థలు కూలి, ఆర్థిక భద్రత కోల్పోవడం సహా పలు అంశాలను పొందుపరచారన్నారు. కన్వీనర్లు మారయ్య, మల్లికార్జున, నాయకులు జనార్ధన్‌నాయుడు, శేషప్ప, గిరి, భాస్కర్‌, నాగేంద్ర, మల్లికార్జున, రాజు, రాజశేఖర్‌, శివ, అరికెర ఉరుకుందు, వీరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:32 AM