Share News

ప్రారంభానికి సిద్ధం

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:15 AM

నగర పరిధిలోని రైతుబజార్లకు మహర్దశ పట్టనుంది. కల్లూరు ఇండస్టీరియల్‌ ఏరియాలో నిర్మించిన గోవర్ధనగిరి రైతుబజార్‌ను త్వరలో ప్రారంభిచనున్నారు. ఇప్పటి దాకా ఇబ్బంది పడుతున్న రైతులు, వినియోగదారుల ఇబ్బందులు తీరనున్నాయి.

ప్రారంభానికి సిద్ధం
గోవర్ధనగిరి రైతుబజార్‌ ఇదే

త్వరలో గోవర్ధనగిరి రైతు బజార్‌ ప్రారంభం..

సి. క్యాంపు రైతుబజార్‌ విస్తరణ షురూ

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని రైతుబజార్లకు మహర్దశ పట్టనుంది. కల్లూరు ఇండస్టీరియల్‌ ఏరియాలో నిర్మించిన గోవర్ధనగిరి రైతుబజార్‌ను త్వరలో ప్రారంభిచనున్నారు. ఇప్పటి దాకా ఇబ్బంది పడుతున్న రైతులు, వినియోగదారుల ఇబ్బందులు తీరనున్నాయి. తాగునీటి సమస్యతో ఇంతకాలం ప్రారంభం కాలేదు. త్వరలోనే తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు.

సి.క్యాంపు రైతు బజార్‌ విస్తరణ..

సి.క్యాంపు రైతుబజారుకు అనుబంధంగా పక్కనే ఉన్న ఆర్‌అండ్‌ బీ క్వార్టర్లను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పది క్వార్టర్లను కూల్చివేసి ఆస్థలంలో అన్ని సౌకర్యాలతో నూతన రైతు బజార్‌ను నిర్మించేం దుకు సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారు. త్వరలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసినట్లు అధికా రులు తెలిపారు. అలాగే వెంకటరమణ కాలనీ అమీన్‌ అబ్బాస్‌ నగర్‌ రైతుబజారులో విశాలమైన స్థలం వినియోగంలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అలాగే కొత్తపేట రైతుబజారులో మరమ్మ తులు చేసి, ఆదాయాన్ని పెంచే దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు.

వినియోగంలోకి తెస్తాం

ఇండస్టీరియల్‌ ఏరియాలో నిర్మించిన గోవర్దనగిరి రైతుబజార్‌ను త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు బజారు ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. ఈ రైతుబజార్‌ వినియోగం లోకి వస్తే చుట్టుముట్టు గ్రామాల రైతులు తాము పండించిన కూరగా యలు విక్రయించునే అవకాశం ఉంది. అలాగే వినియోగదారులకు కూడా మేలు. - రాయణమూర్తి, ఏడీఎం

Updated Date - Dec 10 , 2025 | 12:15 AM