Share News

పోరాటాలకు సిద్ధం

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:11 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కైరుప్పల గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

 పోరాటాలకు సిద్ధం
మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య వ్యతిరేక విధానాలపై పోరాటం

సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య

ఆస్పరి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కైరుప్పల గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌, పెట్టుబడి వ్యవస్థకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. మోదీ మూడోసారి అధికా రంలోకి వచ్చాక మైనార్టీలు, ఆదివాసులు, దళితులు, మహిళలపై దాడులు పెరిగిపో యాయన్నారు. మోదీ ఏకపక్ష నిర్ణయంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అధికారం లోకి వస్తే విదేశాల్లోని నల్లధనాన్ని డబ్బును బయటకు తెచ్చి, పౌరుల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. జిల్లాలోని పెండింగ్‌ల ప్రాజెక్టులు వేదవతి, గుండ్రేవుల రిజర్వాయర్‌, ఆర్‌డీఎస్‌ కుడి కాలువలకు భారీగా నిధులు కేటాయిం చాలన్నారు. అనంతరం కైరుప్పల కమిటీ సభ్యులుగా వీరేష్‌, ఖాసిం, వీరేష్‌ను ఎన్నుకున్నారు. నాగేంద్రయ్య, విరుపాక్షి, కృష్ణమూర్తి, రాజశేఖర్‌, కైరుప్పల ఉప సర్పంచ్‌ వెంకటేష్‌, బడేసాబ్‌, రమేష్‌, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:11 AM