Share News

ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రెడీ

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:47 PM

కర్నూలు ఎంపీపీపై అవిశ్వాసం ప్రవేశపెట్డడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధమయ్యారు.

ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రెడీ
ఫారం-2ను ఆర్డీవోకు అందిస్తున్న ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీటీసీలు

ఆర్డీవోకు ఫారం-2ను అందించిన ఎంపీటీసీ సభ్యులు

త్వరలో టీడీపీ ఖాతాల్లోకి రెండు పదవులు

కర్నూలు రూరల్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): కర్నూలు ఎంపీపీపై అవిశ్వాసం ప్రవేశపెట్డడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధమయ్యారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం రాత్రి కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌ను కలిశారు. ఎంపీపీ పీఠంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని ఫారం-2ను అంద జేశారు. కర్నూలు మండలంలో మొత్తం 2 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా వారిలో పసుపుల-1, మురళీకృష్ణ జి.శింగవరం ఎంపీటీసీ సభ్యులు సవారన్న మరణించారు. మిగిలిన ఆర్‌.కొంతలపాడు ఎంపీటీసీ కురువ గిడ్డమ్మ సుంకేసుల సర్పంచ్‌గా గెలవడంతో కొంతలపాడు ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేశారు. పంచలింగాల ఎంపీటీసీ సభ్యు లుగా ఎంపికైన నాగరాజుకు టీడీపీ ఆధినాయకత్వం కర్నూలు ఎంపీ టికెట్‌ కేటాయించి ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన ఎంపీగా గెలిచిన వెంటనే పంచలింగాల ఎంపీటీసీ స్థానానికి నాగరాజు రాజీనామా చేశారు. 23 ఎంపీటీసీలకు గాను నాలుగు స్థానాలు ఖాళీ ఏర్పడగా మిగిలింది మండలంలో కేవలం 19మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే. ఉల్చాలకు చెందిన వైసీపీ ఎంపీటీసీ డి.వెంకటేశ్వరమ్మ కర్నూలు ఎంపీపీగా కొనసాగు తున్నారు. వైస్‌ ఎంపీపీగా పంచలింగాల-2 ఎంపీటీసీ నెహమ్యా ఉన్నారు. వైసీపీకి సభ్యుల సంఖ్యాబలం తక్కు వగా ఉన్న నేపథ్యంలో ఏపీ పంచాయతీ రాజ్‌ 1994 చట్టం ప్రకారం ఎంపీపీ స్థానానికి నాలుగేళ్లు దాటితే వెంటనే తోటి సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి చట్టం వెసులుబాటు కల్పించింది. ఈక్రమంలో మొత్తం 19మంది ఎంపీటీసీలకు గాను 13మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో ఉన్నారు. రెండు బై మూడోవంతు చొప్పున సభ్యులు టీడీపీ ఉండటంతో ఎంపీటీసీలు మూకుమ్మడిగా ఎంపీపీ స్థానానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. ఈనెల 10వ తేదిలోపు ఆర్డీవో 19మంది ఎంపీటీసీ సభ్యులకు అవిశ్వాసం పెట్టెందుకు నోటీసులను అందజేయనున్నారు. నోటీసు అనంతరం 14రోజులలోపు కర్నూలు ఆర్డీవో అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఎంపీపీతో పాటు వైస్‌ ఎంపీపీ పదవి రెండు కూడా టీడీపీ ఖాతాల్లోకి చేరనున్నాయి.

Updated Date - Nov 07 , 2025 | 11:47 PM