Share News

రీ'వర్రీ'ఫికేషన్‌

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:27 AM

దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఈనెల పింఛన్లు రాక చాలా మంది అవస్థలు పడ్డారు. ఈనెల దివ్యాంగుల పింఛన్‌ను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. జిల్లావ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు సదరం శిబిరాల్లో రీవెరిఫికేషన్‌ చేయించుకోవాలి. దీని కోసం కర్నూలు జీజీహెచ్‌లో సదరం శిబిరానికి బారులు దీరారు. మంత్రాలయం, పత్తికొండ, హోళగుంద, ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, కౌతాళం, కోసిగి, నందవరం వంటి సుదూర ప్రాంతాల నుంచి నడవలేని వారు ఇతర దివ్యాంగులు ఆటోలు, జీపు, బస్సుల్లో తరలివచ్చారు. వాస్తవానికి కర్నూలు జీజీహెచ్‌లో బుధవారం కేవలం 50మందికి మాత్రమే రీవెరిఫికేషన్‌ ఉంది. 50 మందికి గానూ 800 మంది దివ్యాంగులు సదరం శిబిరానికి వచ్చారు. ఆస్పత్రిలో కనీసం వారికి తాగడానికి నీరు కూడా లేక ఇబ్బందులు పడ్డారు.

రీ'వర్రీ'ఫికేషన్‌
దివ్యాంగులకు తేదీలను రాసి ఇస్తున్న సదరం క్లర్క్‌

సదరం శిబిరానికి బారులుదీరిన దివ్యాంగులు

50మందికి గానూ 800 మంది హాజరు

అధికారుల సమన్వయ లోపం

సరైన సౌకర్యాలు కల్పించని వైనం

మళ్లీ రమ్మన్నారంటూ ఆవేదన

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సదరం శిబిరాల నిర్వహణ గందరగోళంగా మారింది. ఈనెల ది వ్యాంగుల పింఛన్‌ను అధికారులు హోల్డ్‌లో పెట్టడంతో పింఛన్‌ను నిలుపుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు సదరం శిబిరాల్లో రీవెరిఫికేషన్‌ చేయించుకోవాలి. ఇందు కోసం ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా సదరం శిబిరాలను ఏర్పాటుచేసింది. జిల్లాలో ఆర్థో, వినికిడి, కంటి, మానసిక సమస్యలతో దాదాపు 40 వేలకు పైగా సదరం సర్టిఫికెట్ల ద్వారా ఒక్కొక్కరు రూ.6వేల పింఛన్లు పొందుతున్నారు. ఆగస్టు నెలలో మూడు వేల మంది దివ్యాంగుల పింఛన్‌ను హోల్డ్‌లో పెట్టారు.

తాగునీరు కూడా లేక..

దివ్యాంగులు సదరం, సచివాలయ సిబ్బంది ఇచ్చిన నోటీసులను చేతబట్టి బారులు తీరారు. మధ్యాహ్నం 3గంటల వరకు దివ్యాంగులు నడవలేని వారు అవస్థలు పడ్డారు. ఎక్కువ సంఖ్యలో దివ్యాంగులు రావడంతో తాగడానికి కూడా మంచినీరు లేక ఇబ్బందులు పడ్డారు. రీవెరిఫికేషన్‌లో వైద్యులతో తాము ఎక్కువ పర్సంటేజీ వేయిస్తా మంటూ కొందరు దళారీలు దివ్యాంగులను నమ్మబలుకు తున్నారనికొందరు పిర్యాదు చేశారు. సదరం సిబ్బంది మాత్రం ఏ మాత్రం పట్టించుకోక పోవడం విశేషం. చివరకు దివ్యాంగులకు రీవెరిఫికేషన్‌ తేదీలను రాసి ఇవ్వడంతో మధ్యాహ్నం 3గంటలకు వెనుదిరిగారు.

సుదూర ప్రాంతాల నుంచి..

రీవెరిఫికేషన్‌కు సదరం శిబిరాలకు వెళ్లని దివ్యాంగుల పింఛన్‌ను నిలుపుదల చేయడంతో బుధవారం కర్నూలు ప్రభ్తువ సర్వజన వైద్యశా ల సదరం శిబిరానికి బారులు దీరారు. మంత్రా లయం, పత్తికొండ, హోళగుంద, ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, కౌతాళం, కోసిగి, నందవరం వంటి సుదూర ప్రాంతాల నుంచి నడవలేనివారు ఇతర దివ్యాంగులు ఆటోలు, జీపు, బస్సుల్లో తరలివచ్చారు. వాస్తవానికి కర్నూలు జీజీహెచ్‌లో బుధవారం కేవలం 50 మందికి మాత్రమే రీవెరిఫికేషన్‌ ఉంది. 50మందికి గానూ 800 మంది దివ్యాంగులు సదరం శిబిరా నికి రావడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసు కున్న కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెం డెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు శిబిరానికి చేరుకుని మరలా తేదీని రీవెరిఫికేషన్‌ కోసం ఇవ్వాలని ఆదేశించారు.

రూ.2వేలు ఖర్చుపెట్టి ఆటోలో వచ్చా

మాది ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామం. ఈనెల దివ్యాంగుల పింఛన్‌ ఇవ్వలేదు. సచివాలయ సిబ్బంది కర్నూలు వెళ్లి సదరం శిబిరంలో వైద్యులతో పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు తెచ్చుకోవాల న్నారు. దీంతో నడవలేని తాను రూ.2వేలు ఖర్చు పెట్టి ఆటోలో వచ్చాను. తీరా ఇక్క డికి వస్తే మళ్లీ రమ్మన్నారు. - చంద్రన్న, పింఛన్‌దారుడు, ముత్తుకూరు, ఆస్పరి మండలం.

తీరా ఇక్కడికి వస్తే వెనక్కు..

పింఛన్‌ రాలేదని ఆదోని నుంచి ఆటోలో కర్నూలుకు వచ్చా. నడవలేను కాబట్టి ఆటోలో వచ్చాను. నాకు రూ.6వేల పింఛన్‌ వచ్చేది. అది ఈనెల రాలేదు. దీంతో కర్నూలు సదరం శిబిరానికి వెళ్లాలన్నారు. తీరా ఇక్కడకు వస్తే వెనక్కు పంపారు. - మల్లికార్జున, పింఛన్‌దారుడు, ఆదోని

Updated Date - Aug 07 , 2025 | 12:27 AM