నేటి నుంచి బనగానపల్లెలో ఆర్డీవో కార్యాలయ సేవలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:02 AM
పునర్వి భజనలో భాగంగా జిల్లాలో నాలుగోవ రెవెన్యూ డివిజన్‌గా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ రూపాంతంరం చెందింది.
నంద్యాల/ బనగానపల్లె, డిసెంబరు30 (ఆంధ్రజ్యోతి): పునర్వి భజనలో భాగంగా జిల్లాలో నాలుగోవ రెవెన్యూ డివిజన్‌గా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ రూపాంతంరం చెందింది. ఆ దిశగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో బుధవారం నుంచి బనగానపల్లె రెవెన్యూ డివిజన్ కార్యాలయ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల మండలాలాలు వస్తాయి. ఆయా మండలాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డోన్ రెవెన్యూ డివిజన్ అధికారిగా పనిచేస్తున్న నరసింహులుకు ఇన్‌చార్జి బాధ్య తలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10.30 గంటలకు బనగానపల్లెలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ముగ్గురు డీటీలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను అక్కడికి కేటాయించారు.