Share News

రాయలసీమ కళలకు కాణాచి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:01 AM

రాయలసీమ కళలకు కాణాచి అని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి, తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

రాయలసీమ కళలకు కాణాచి
మాట్లాడుతున్న టీజీ వెంకటేష్‌

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌

కళాకారులకు ప్రోత్సాహం అవసరం: బీసీ రాజారెడ్డి

12 మంది కళాకారులకు కందుకూరి అవార్డులు ప్రదానం

ఘనంగా తెలుగు నాటకరంగ దినోత్సవం

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్ర జ్యోతి): రాయలసీమ కళలకు కాణాచి అని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి, తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేశ్‌, గౌరవ అతిథులు బనగానపల్లె అరుణభారతి అధ్యక్షు డు బీసీ రాజారెడ్డి, ప్రముఖ వైద్యుడు బి. శంకరశర్మ, ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా బ్రాంచ్‌ మేనేజర్‌ ఆకుల లక్ష్మణ్‌ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభిం చారు. అనంతరం వారు కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ రాయలసీమ కళలకు కాణాచి అని అన్నారు. చల్లా నవీన్‌కుమార్‌ తనను కలిసి టీజీవీ కళాక్షేత్రంలో సత్య హరి శ్చంద్ర నాటకం వేస్తున్నామని ఆహ్వానించారని, ఆయన ప్రదర్శన తిలకించేందుకు ప్రత్యేకంగా వచ్చానని అన్నారు. కొత్తగా నాటకాలు వేస్తున్న చల్లా నవీన్‌కుమార్‌, కేవీ రమణ భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. మరో అతిఽథి బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో కవులు, కళాకారులు ఉన్నా వారికి ప్రోత్సాహం అందడం లేదని, తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర చాలా కీలకంగా పని చేసిందని అన్నారు. డాక్టర్‌ బి. శంకరశర్మ మాట్లాడుతూ నూతన కళాకారులు నాటకంపట్ల మక్కువతో కళారంగంలో ప్రవేశించడం అభినందనీ యమని చెప్పారు. సమావే శానికి అధ్యక్షత వహించిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షు డు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ యువ కళాకారులకు టీజీ కళాక్షేత్రం ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు.

కళాకారులు, కందుకూరి పురస్కార గ్రహీతలకు సత్కారం...

సత్య హరిశ్చంద్ర నాటక కళాకారులు చల్లా నవీన్‌కుమార్‌ నాయుడు, ఎంఆర్‌ రాధిక, హార్మోనిస్టు ఎర్రమ పాండురంగయ్య, అలాగే శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించిన జీవీ శ్రీనివాసరెడ్డి, కేవీ రమణ, కె. బాలవెంకటేశ్వర్లు, హార్మోనిస్టు బలరాంలను మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌, బీసీ రాజారెడ్డి, డాక్టర్‌ బి. శంకరశర్మ, ఆకుల లక్ష్మణ్‌ ఘనంగా సత్కరించారు. అలాగే టీజీవీ కళాక్షేత్రం ప్రకటించిన కందుకూరి అవార్డులు సంగీత గురువులు పీజీ వెంకటేశ్వర్లు, జేఎం రాజశేఖర్‌రాజు, లక్ష్మన్న, కేశవులు,ట ఎస్‌. ధనుంజయ్‌, పి. రామలింగం, ఎన్‌ రామకృష్ణారెడ్డి, జే. మహేశ్వరయ్య, బందేగౌడ, బలరాం నాయుడు, చల్లా నరసింహనాయుడు, కేబీ నాగప్పలకు అందజేసి వారికి శాలువ, జ్ఞాపిక, పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా అరుణభారతి సంస్థ తరపున బీసీ రాజారెడ్డి కళాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం ప్రతినిధులు మహమ్మద్‌ మియా, ఇనాయతుల్లా, పి. రాజారత్నం, సంగా ఆంజనేయులు, వాల్మీకి రాముడు, గాండ్ల లక్ష్మన్న, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్‌చార్జి గోరంట్ల కొండప్ప, సోమశంకర్‌రెడ్డి, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:01 AM