రేషన్ మాఫియా దందా
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:08 AM
‘అక్రమార్జన కు కాదేదీ అనర్హం’ అన్నట్టు కొందరు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. అక్ర మార్కులు రేషన్ బియ్యాన్ని లారీల్లో తరలిస్తూ పట్టుబ డ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్ రేషన్ బియ్యంగా నిర్ధారించి లారీని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు.
పత్తికొండలో రేషన్ బియ్యం పట్టివేత
సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీవో
లారీ సీజ్.. బియ్యం గోడౌన్‌కు తరలింపు
అక్రమార్కులపై చర్యలు ఆర్డీవో భరత్‌నాయక్
పత్తికొండ టౌన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘అక్రమార్జన కు కాదేదీ అనర్హం’ అన్నట్టు కొందరు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. అక్ర మార్కులు రేషన్ బియ్యాన్ని లారీల్లో తరలిస్తూ పట్టుబ డ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్ రేషన్ బియ్యంగా నిర్ధారించి లారీని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం పత్తికొండ పట్టణంలో చోటు చేసుకుంది. పత్తికొండ పట్టణంలో రేషన్ బియాన్ని అక్రమార్కులు లారీలో లోడు చేసుకుని ఆదోనికి తరలిస్తుండగా హీరో షోరూం వద్ద గుంతలో లారీ ఇరుక్కుపోయింది. ఆ లారీని ఎక్సవేటర్ సాయంతో ఈ బయటకు తీసే క్రమంలో లారీలో ఉన్న రేషన్ బియ్యం కిందపడ్డాయి. దీంతో స్థానికులు రేషన్ బియ్యంగా గుర్తించారు. వారు వెంటనే ఆర్డీవో భరత్‌నాయక్, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్డీవో భరత్‌నాయక్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. లారీ డ్రైవర్ ను విచారించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో లారీని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. లారీని గోడౌన్‌కు తరలించి తూకం వేశారు. 236 బ్యాగుల్లో 133.3 క్వింటాళ్లు బియ్యాన్ని రెవెన్యూ అధికారులు గోడౌన్‌లో భద్రపరిచారు.
బియ్యం సేకరించేది ఇలా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పేదలకు నెలనెలా ఉచితం గా బియ్యం సరఫరా అవుతాయి. రేషన్ మాఫియా కొంద రు పేదల నుంచి, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని కర్నూలు రోడ్డులోని ఓ గోడౌన్‌లో భద్రపరిచి అక్కడి నుంచి లారీల్లో ఆదోని ప్రాంతానికి, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ట్లు విశ్వసనీయ సమాచారం.
పట్టుబడింది ఇలా..
పత్తికొండ పట్టణంలోని కర్నూలు రోడ్డులో అక్రమ వ్యాపార స్తులు దుకాణాలను అద్దెకు తీసుకుని బియ్యాన్ని అద్దె గదు ల్లో నిల్వ చేసుకుంటున్నారు. వందలాది క్వింటాళ్లను సేక రించిన తర్వాత వాహనాల్లో ఆదోనికి తరలించి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
అక్రమ బియ్యం గోడౌన్‌కు తరలింపు
లారీలో పట్టుబడిన బియ్యాన్ని ఆర్డీవో భరత్‌నాయక్ సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. లారీని సివిల్ సప్లై గోదాముకు తరలించారు. అక్కడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ జహనాజీ, ఆర్‌ఐ శ్రీనివాసరావు పట్టుబడిన బియ్యాన్ని తూకం వేసి గోడౌన్‌లో భద్రపరిచారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
అక్రమార్కులపై చర్యలు తప్పవు
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. అక్రమంగా తరలిస్తున్న బియ్యం వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం. - భరత్‌నాయక్, ఆర్డీవో