భారీ ధర పలికిన పొట్టేళ్లు
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:24 AM
ఓ రెండు పొట్టేళ్లు భారీ ధర పలికాయి. ఒకటి రూ.90 వేలు తీసుకోగా మరొకటి రూ.80 వేలు పలికాయి.

అన్న రూ.80 వేలు, తమ్ముడు రూ.90 వేలకు కొనుగోలు
దేవనకొండ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఓ రెండు పొట్టేళ్లు భారీ ధర పలికాయి. ఒకటి రూ.90 వేలు తీసుకోగా మరొకటి రూ.80 వేలు పలికాయి. గద్దెరాళ్ల దేవర కోసం పల్లెదొడ్డికి చెందిన హనుమంతు, రామాంజిని అన్నదమ్ముల కుమారులు గోవిందు తెలంగాణలోని ఐజ సంతలో రూ.90 వేలకు ఓ పొట్టేలు కొన్నాడు. అన్న కౌలుట్ల కర్ణాటకలోని బళ్లారి సంతకు వెళ్లి రూ.80 వేలకు పొట్టేలు కొన్నాడు.