చట్టసభలపై అవగాహన కల్పించడం అభినందనీయం: టీజీ
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:04 AM
విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూన 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. దేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం దూపాడు సమీపంలోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన మాక్ పార్ల మెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేశ హాజరై ప్రసం గించారు. కొన్ని ప్రశ్నలు వేసి సమాధా నాలు చెప్పిన వారికి టీజీ నగదు ప్రోత్సా హకాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గీతామా ధురి, నిర్మల కిషోర్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కేవీసుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలత పాల్గొన్నారు.