Share News

జిల్లాలో వర్షాలు

ABN , Publish Date - Sep 27 , 2025 | 10:54 PM

జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహానంది, వెలుగోడు, నంద్యాల బండిఆత్మకూరు, బేతంచర్ల, బనగానపల్లె మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది.

జిల్లాలో వర్షాలు
బుక్కాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువు అలుగు

మహానందిలో అత్యధికంగా 87.2 మి.మీ. వర్షపాతం నమోదు

నంద్యాల ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహానంది, వెలుగోడు, నంద్యాల బండిఆత్మకూరు, బేతంచర్ల, బనగానపల్లె మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 1216.8 మి.మీ. వర్షపాతం నమోదయింది. అనేక మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మహానంది మండలంలో అత్యధికంగా 87.2 ఎంఎం వర్షపాతం నమోదయింది. దీంతో బుక్కాపురం వద్ద చెరువు అలుగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెలుగోడు మండలంలో 77.6, నంద్యాల మండలం 74.2, ఆత్మకూరు 73.4, నంద్యాల పట్టణం 70.0, బండిఆత్మకూరు 63.2, బేతంచర్ల 60.4, బనగానపల్లె 58.0, కొత్తపల్లె 57.0, శ్రీశైలం 55.0, పాణ్యం 52.4, నందికొట్కూరు మండలంలో 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే జూపాడుబంగ్లా 51.4, పాములపాడు 51.2, పగిడ్యాల 44.8, డోన్‌ 42.2, గడివేముల 39.4, గోస్పాడు 38.0, మిడ్తూరు 37.2, కోవెలకుంట్ల 32.0, శిరివెళ్ల 19.2, రుద్రవరం 16.8, ప్యాపిలి 15.2, దొర్నిపాడు 12.4, అవుకు 11.4, సంజామల మండలంలో 9.6 ఎంఎం వర్షపాతం నమోదయింది.

Updated Date - Sep 27 , 2025 | 10:54 PM