Share News

మండే ఎండలో వర్ష సూచన

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:04 PM

ఉమ్మడి జిల్లాలో భగభగలాడే ఎండల్లో కూడా మంగళవారం సాయంకాలం కాగానే వర్ష సూచనతో చల్లబడింది.

మండే ఎండలో వర్ష సూచన
నంద్యాలలో నిర్మానుష్యంగా ఉన్న ఆర్‌ఎఫ్‌ రోడ్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో భగభగలాడే ఎండల్లో కూడా మంగళవారం సాయంకాలం కాగానే వర్ష సూచనతో చల్లబడింది. రానున్న మూడు రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీలతో ఎండలు మంచిపోయినా సాయంత్రం 4ఎంఎం నుంచి 40 ఎంఎం వరకు వర్షం పడే అవకాశముందని వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడిస్తోంది. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 10నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని, గాలిలో తేమశాతం ఉదయం 50నుంచి 54శాతం, మధ్యాహ్నం 17 నుంచి శాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. 1,2,3,4వ తేదీల్లో సాయంత్రం ఉరుములు, మెరుపులు బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

కర్నూలు జిల్లాలో మంగళవారం మంత్రాలయంలో 40.90. కోడుమూరులో 40.79, కోసిగి 40.40, ఎమ్మిగనూరు 40.23, కౌతాళం 39.50, కల్లూరు 39.50, ఓర్వకల్లు 39.40, దేవనకొండ 39.29, వెల్దుర్తి 39.23, హొళగుంద 39.00 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

నంద్యాల జిల్లాలో కోవెలకుంట్ల 40.95, మహానంది 40.93, రుద్రవరం 40.67, కొత్తపల్లె 40.48, బండిఆత్మకూరు 40.42, పాణ్యం 40.29, గడివేముల 40.27, బనగానపల్లె 40.24, శిరువెళ్ల 40.22, జూపాడుబంగ్లా 40.04 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Apr 29 , 2025 | 11:04 PM