Share News

ముంచిన వర్షం

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:48 AM

మండలంలోని జొన్నగిరి, ఎర్రరగుడి, పగిడిరాయి, ఉప్పర్లపల్లి, గ్రామం రోళ్లపాడు తండా, కడమకుంట్ల గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.

ముంచిన వర్షం
ఎర్రగుడిలో వర్షం దెబ్బకు కొట్టుకుపోయిన వేరుశనగ కట్ట

కొట్టుకుపోయిన వేరుశనగ కట్టలు.. రూ.2 లక్షల నష్టం

రోళ్లపాడు తండాలో కొట్టుకుపోయిన పైపులైన్‌

తుగ్గలి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జొన్నగిరి, ఎర్రరగుడి, పగిడిరాయి, ఉప్పర్లపల్లి, గ్రామం రోళ్లపాడు తండా, కడమకుంట్ల గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.

కష్టం నీటిపాలు..

రైతులు వేరుశనగ కోత కోసి, కట్టలను పొలంలోనే ఉంచారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడతో ఆరుగాలం కష్టించి పండిచిన వేరుశనగ దిగుబడి నీళ్లలో కొట్టుకుపోయింది. రూ.లక్ష దాకా పంట నష్టం వచ్చిందని రైతులు భోరున విలపిస్తున్నారు. అలాగే రోళ్లపాడు తండాలో తాగునీటి పైపులైన్‌ కూడా కొట్టుకుపోవడంతో తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు.

జి.ఎర్రగుడికి చెందిన రైతు రాఘవేంద్ర రెండెరాల్లో వేరుశశనగ సాగు చేశాడు. దిగుబడిని పొలంలో నిల్వ చేయగా.. తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో తాను రూ.60వేల పైగా పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట నీళ్లపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతును ఆదుకోవాలని టీడీపీ నాయకులు చంద్ర, శేఖర్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

జొన్నగిరి చెరువు నిండి కడిదొడ్డు ద్వారా నీళ్లు పారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చెరువులు నిండటంతో జొన్నగిరి, ఉప్పర్లపల్లి గ్రామాల్లో సాగు, తాగునీరుకు ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు.

Updated Date - Aug 10 , 2025 | 12:48 AM